Monday 8 December 2014

జోరుమీదున్న స్వాతి

ఇంటగెలిచి రచ్చ గెలవాలన్న నానుడిని నిజం చేస్తోంది తెలుగు సుందరి స్వాతి. అందంతో పాటు చక్కటి అభినయకౌశలం కలిగిన ఈ సొగసరి ప్రస్తుతం దక్షిణాదిన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. స్వామిరారా చిత్రంతో గత ఏడాది తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుందామె. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ సరసన కార్తీకేయ చిత్రంలో నటిస్తోంది. ఇదిలావుండగా తమిళ, మలయాళ భాషల్లో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది స్వాతి.

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల నేర్పు, దక్షిణాది భాషలపై మంచి పట్టుకలిగి వుండటంతో తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాల్లో తనకు అవకాశాలు రావడం పట్ల స్వాతి ఆనందం వ్యక్తం చేస్తోంది. తెలుగులో కూడా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయని చెప్పింది. తెలుగులో ఆమె నటిస్తున్న కార్తీకేయ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Find Here Telugu Movie Reviews
                 Latest Telugu Film Ratings